![]() |
![]() |

శోభా శెట్టి కొద్దీ రోజుల నుంచి హెల్త్ అప్ సెట్ అవడంతో వీడియోస్ చేయలేకపోతోందట. ఐతే ఈ విషయాన్నీ తన యూట్యూబ్ వీడియొ ద్వారా ఎక్స్ప్రెస్ చేసింది. ఐతే తేజ వాళ్ళ ఫామిలీ హైదరాబాద్ రావడంతో వాళ్ళను కలవాలని అది కూడా ముందుగా చెప్పకుండా సర్ప్రైజ్ చేయడానికి వెళ్లాలనుకుందట. కానీ వాళ్ళే శోభాకు సర్ప్రైజ్ చేసినట్టు చెప్పింది. శోభా వెళ్తున్న విషయమ్ తెలియకపోవడం వలన వాళ్ళు వేరే చోటికి వెళ్లిపోయారట. దాంతో అక్కడికి కాకుండా ఫైనల్ గా హాస్పిటల్ కి వెళ్లినట్లు చెప్పింది. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అని చెప్పింది. కొద్దీ రోజుల నుంచి తనకు థ్రోట్ పెయిన్ బాగా వస్తోందని చెప్పింది.
అసలు తగ్గకపోవడంతో తాను తెలియక కొన్ని టాబ్లెట్స్ వేసుకోగా అది ఇంకా తగ్గలేదన్న భయంతో హాస్పిటల్ కి వెళ్లిందట. ఐతే తనకు ఎసిడిటీ బాగా పెరిగిపోయింది... లైఫ్ స్టైల్ మార్చాలని డాక్టర్స్ సలహా ఇచ్చారట. దాంతో అలా హాస్పిటల్ కి వెళ్లి రావాల్సి వచ్చిందని చెప్పింది. ఇక వాళ్ళ అమ్మకు కూడా హెల్త్ సరిగా లేదని ఈ ఇయర్ ఇలా బ్యాడ్ గా స్టార్ట్ అయ్యిందని పాపం తెగ ఫీలైపోయింది. ఈ అన్ని కారణాల వలన అసలు వీడియోస్ చేయట్లేదని కానీ ఇక మీద అందరికీ నచ్చే మెచ్చే వీడియోస్ ఎంత చేయగలదో అంతా చేసి చూపిస్తానని చెప్పింది శోభా శెట్టి. ఇక నెటిజన్స్ ఐతే జాగ్రత్త హెల్త్ , రెస్ట్ తీసుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్బాస్ తెలుగు సీజన్-7లో దాదాపు 14 వారాల పాటు అందరికీ చుక్కలు చూపించింది శోభా. శోభాశెట్టి బిగ్బాస్ కన్నడ సీజన్ 11లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి హెల్త్ బాలిక తిరిగొచ్చేసింది. ఇక శోభా శెట్టి కార్తీక దీపం సీరియల్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.
![]() |
![]() |